Site icon TeluguMirchi.com

Naa Saami Ranga Trailer : ఈ పాలి పండక్కి ‘నా సామిరంగ రంగ..’ అంతే..


కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ఈ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేయగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

ట్రైలర్ చూస్తుంటే పక్కా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ‘కిష్టయ్య (నాగార్జున)ను కొట్టే మగాడు ఎవడైనా ఉన్నాడా అసలు’ అంటూ అల్లరి నరేశ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్.. ‘అన్నట్టు మరిచిపోయాను.. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని నాగ్ చెప్పే డైలాగ్‍తో ముగుస్తుంది. అంతేకాదు నాగార్జున అయితే ఊర మాస్ యాక్షన్ తో, గోదావరి యాస డైలాగ్స్ తో అదరగొట్టేసాడు. ఎంఎం కీరవాణి బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక నాగార్జున, అషిక రంగనాథ్‍ ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అల్లరి నరేష్ సరసన మిర్నా.. రాజ్తరుణ్ కి జోడిగా రుక్సార్ ధిల్లాన్ నటిస్తున్నారు. మొత్తానికి ఈసారి పండక్కి ‘నా సామిరంగ రంగ..’ అంతే.

Naa Saami Ranga Trailer | Nagarjuna Akkineni | Allari Naresh | Vijay B | MM Keeravaani | SS Screens

Exit mobile version