కింగ్ నాగార్జున అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. ఈ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేయగా.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఇక ‘నా సామిరంగ’ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ని కొద్దిసేపటి క్రితం అనౌన్స్ చేసారు మేకర్స్.
‘నా సామిరంగ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 10న బుధవారం నాడు హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో సాయంత్రం 6 గం. ల నుండి గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. అలాగే వేడుకలకు సిద్ధంగా వుండండి, ఈవెంట్‌లో భారీ సర్‌ప్రైజ్‌లు ఎదురుచూస్తున్నాయి అని తెలిపారు. ఆ సర్ప్రైజ్ లు ఏంటో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే మరి.
నా సామి రంగ రంగ
![]()
Get ready for the Euphoric celebrations on January 10th from 6 PM onwards as we celebrate the #NaaSaamiRanga Ranga event
Massive Surprises Awaits at the event
#NaaSaamiRangaOnJAN14 #NSRForSankranthi
KING
@iamnagarjuna @allarinaresh @mmkeeravaani… pic.twitter.com/n0XcgxEbdR
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 8, 2024