Site icon TeluguMirchi.com

నా పేరు సూర్య లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..

అల్లు అర్జున్ , అను ఇమ్మానుయేల్ జంటగా స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వం లో రాబోతున్న మూవీ నా పేరు సూర్య. ఈ సినిమా ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో టీజర్ కు వచ్చిన వ్యూస్ చూస్తే అర్ధం అవుతుంది. ఏప్రిల్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ షూటింగ్ రేపటి నుండి అమెరికా లో మొదలు కానుందని సమాచారం.

హీరోయిన్ అను ఇమ్మానుయేల్, అల్లు అర్జున మీద రొమాంటిక్ సాంగ్ షూట్ చెయ్యబోతున్నారు. ఈ సాంగ్ తో దాదాపు షూటింగ్ అంత పూర్తి చేసుకున్నట్లే. తమిళ్ హీరో అర్జున్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతుండగా , విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నాడు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ఈ సినిమా లో దేశభక్తి గల యువకుడి పాత్రలో అల్లు అర్జున్ నటించాడు.

Exit mobile version