ప్రివ్యూ : నా పేరు సూర్య

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం , అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల రిలీజ్ అయినా ట్రైలర్స్ , ప్రోమో సాంగ్స్ మొదలగున్నవి అన్ని కూడా సినిమాకు పాజిటివ్ బజ్ ను తీసుకొచ్చాయి. మరి అభిమానులు పెట్టుకున్న అంచనాలను సూర్య అందుకున్నాడా లేదా అనేది రేపు తెలుస్తుంది. ఈ లోపు ప్రివ్యూ ఫై ఓ లుక్ వెయ్యండి.

నా పేరు సూర్య హైలైట్స్ :

* ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్ గెటప్ అండ్ స్టైలిష్ ఫైట్స్ .. ఈ చిత్రానికి మెయిన్ బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ ని ఎప్పుడూ చూడ‌ని విధంగా ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశి ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం బ‌న్ని త‌న ప్రాణం పెట్టి చేశాడ‌నేది అక్ష‌ర‌స‌త్యం. పాత్ర‌లో ఇమిడిపోవ‌డ‌మే కాకుండా డెడికేష‌న్ తో అస‌లు రియ‌ల్ మిల‌ట‌రి వాళ్ళు ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో తెలుసుకుని, వాళ్ళ‌ని క‌ల‌సి ఇది సినిమా అని కాకుండా పాత్ర‌లో జీవించాడు. చిత్రం చూసిన వారికి తెలుస్తుంది.

* ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ మ‌రియు డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.

* కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ..మొదటిసారి మెగా ఫోన్ తో రానున్నడం. మొదటిసారి అల్లు అర్జున్ ను ఆర్మీ ఆఫీసర్ రోల్ లో చూపించడం. దేశ భక్తి నేపథ్యం లో కథను రాసుకోవడం ఇవన్నీ కూడా సినిమాకు హైలైట్స్ గా కనిపిస్తున్నాయి.

* ‘మజ్ఞు’ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచమైన అను ఇమ్మానుయేల్ ఆ చిత్రం తరువాత హిట్ అనేది ఆమెను పలకరించలేదు. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసినా ఈ చిత్రం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ ఫై భారీ ఆశలే పెట్టుకుంది. ట్రైలర్ లో బన్నీ – అను ల కెమిస్ట్రీ బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ మూవీ తో అను కు ఓ హిట్ పడ్డట్లే అని అభిమానులు అంటున్నారు.

* విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం , యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ యాక్టింగ్

* రాజీవ్ రవి సినిమా ఫోటోగ్రఫీ ఇలా అన్ని కూడా సినిమాకు హైలైట్స్ గా చెప్పవచ్చు.

ఇక పూర్తి రివ్యూ కోసం తెలుగుమిర్చి ని రీ ఫ్రెష్ చేస్తూనే ఉండండి.