Site icon TeluguMirchi.com

నా పేరు సూర్య ప్రివ్యూ టాక్ తో అభిమానులు షాక్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం “నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిక్, టెంపర్, ఎవడు, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు కథలను అందించి రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ, మొదటిసారి ఈ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుండడం , అల్లు అర్జున్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ గా కనిపించడం తో ఈ మూవీ భారీ అంచనాల మధ్య మధ్య ఈరోజు రిలీజ్ అయ్యింది.

అంతకంటే ముందే ఓవర్సీస్ లో గురువారం రాత్రే ప్రిమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ఈ మూవీ టాక్ బయటకు వచ్చింది. సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా లో వ్యక్త పరుస్తున్నారు. సమ్మర్ లో వచ్చిన రంగస్థలం , భరత్ అనే నేను చిత్రాలు ఘన విజయం సాధించి మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ నా పేరు సూర్య మాత్రం ఆ రేంజ్ లో లేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ దారుణంగా ఉందని , సెకండ్ హాఫ్ కాస్త బెటర్ అని కొంతమంది అంటుంటే , మరికొంతమంది మాత్రం సినిమా సూపర్ హిట్ అని చెపుతున్నారు. అభిమానులు మాత్రం సినిమాకు మిక్సిడ్ టాక్ వస్తుండడం తో షాక్ లో పడ్డారు. ఇక పూర్తి రివ్యూ , టాక్ తెలియాలంటే మరికొంత సేపు ఆగాల్సిందే.

Exit mobile version