నా పేరు సూర్య ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డీజే తో పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తో నా పేరు సూర్య తో అభిమానులను అలరించాలని చూస్తున్నాడు. స్టార్ రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ మూవీ సెట్స్ ఫై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా డీజే తర్వాత సైలెంట్ అయినా బన్నీ , దసరా తర్వాత తన జోరును చూపించబోతున్నాడు. దసరా కానుకగా ఈ మూవీ ఫస్ట్ లును రిలీజ్ చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ లోగో ఎలా ఉందో సినిమా ఓపెనింగ్ రోజే అభిమానులకు చెప్పాడు..ఇక మిగిలిన బన్నీ లుక్ ను సరికొత్తగా డిజైన్ చేసాడట వంశీ. ఫారిన్ ఫిట్ నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో సరికొత్తగా మేకోవర్ అయ్యాడని తెలుస్తుంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా. ఈనెల 24 నుంచి 15 రోజుల పాటు ఊటీలో మరో షెడ్యూల్ జరుపుకోబోతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

అల్లు అర్జున్ సరసన అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్-శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించగా, సీనియర్ నటులు అర్జున్, శరత్ కుమార్ ఈ మూవీ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగబాబు మూవీ కి సమర్పకులు కాగా లగటపాటి శ్రీధర్ నిర్మాత.