అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్ర ‘నా పేరు సూర్య’. నా ఇల్లు ఇండియా. రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తికాగా రేపటి నుండి కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రం కోసం బన్నీ యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుని, సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్నారు.
ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించగా సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ బన్నీకి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. కాగ, తెలుగు, మలయాళం, హిందీ భాషలలో ఈ సినిమాని విడుదల చేయాలని ముందుగానే భావించినప్పటికి, రీసెంట్గా తమిళం.. మరాఠి.. బెంగాలీ.. భోజ్ పురి భాషల్లోనూ ‘నా పేరు సూర్య’ను రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.