Site icon TeluguMirchi.com

Operation Valentine : మైత్రీకే ‘ఆపరేషన్ వాలెంటైన్’ నైజాం థియేట్రికల్ రైట్స్


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఏరియల్ యాక్షన్ అడ్వెంచర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ పుల్వామా దాడి మరియు బాలాకోట్ వైమానిక దాడుల వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఇకపోతే ఆపరేషన్ వాలెంటైన్ థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ సహా మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాం ఏరియాలో సలార్ మరియు హను-మాన్ చిత్రాలను విజయవంతంగా పంపిణీ చేసిన విజయవంతమైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం నైజాంలో పెద్ద ఎత్తున విడుదల అవుతుంది. ఇక సినిమాలో వరుణ్ తేజ్ IAF ఆఫీసర్‌గా నటించగా, మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది. రుహాణి శర్మ, నవదీప్ కీలక పాత్రలు పోషించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version