ముత్తయ్య బయోపిక్ లో సైరా నటుడు ..

ఇటీవల కాలంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది. సినీ , క్రీడా, బిజినెస్ ఇలా అన్ని రంగాల వ్యక్తులకు సంబందించిన బయోపిక్ లు తెరకెక్కిస్తూ వారి గొప్ప తనాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురి బయోపిక్ లు తెరపై వచ్చి ఆకట్టుకోగా..తాజాగా శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్ తెరకెక్కబోతుంది. మురళీధరన్‌ పాత్ర లో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించడం విశేషం.

ఈ సినిమాకు శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భాంగా విజయ్ మాట్లాడుతూ ..ముత్తయ్య మురళీధరన్‌గారు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, స్వయంగా నాకు క్రికెట్‌ టిప్స్‌ చెప్పడం సంతోషంగా ఉంది. నన్ను నమ్మిన మురళీధరన్‌కు, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అని తెలుపగా..
‘‘విజయ్‌ సేతుపతి వంటి నటుడు నా పాత్రలో నటించడం హ్యాపీ’’ గా ఉందని మురళీధరన్‌ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం విజయ్.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రానుంది.