తమిళం లో స్టార్ డైరెక్టర్ గా ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన మురుగదాస్..ప్రస్తుతం రజని తో దర్బార్ చేసి సంక్రాంతి బరిలో రాబోతున్నాడు. జనవరి 09 న ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్య క్రమాల్లో బిజీ బిజీ గా ఉన్నారు. కాగా తెలుగు లో ఈయన చిరంజీవి తో స్టాలిన్ , మహేష్ తో స్పైడర్ చిత్రాలు చేయగా..ఈ రెండు కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.
ఈ నేపథ్యంలో మురుగదాస్ ఈ రెండు చిత్రాలు ప్లాప్ కు కారణం నేనే అంటూ చెప్పుకొచ్చారు. తెలుగు ప్రేక్షకుల పల్స్ తెలుసుకోలేకపోయానని .. స్పైడర్ విషయంలో మహేష్‌ను తమిళ ఆడియన్స్‌కు పరిచయం చేయాలనుకున్నానే తప్ప తెలుగు ప్రేక్షకులు మహేష్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో పట్టించుకోలేదన్నాడు. అలాగే చాలా రోజులుగా కిందట ఎన్టీఆర్‌కు కథ చెప్పానని..కాకపోతే ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదని ప్రస్తుతం అయితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవం అని క్లారిటీ ఇచ్చాడు.