మురళి శర్మ కుటుంబంలో విషాదం నెలకొంది. మురళి శర్మ తల్లి పద్మ శర్మ కన్నుమూశారు. ఆమె వయసు 76 సంవత్సరాలు. ముంబయిలోని తమ నివాసంలో పద్మ శర్మ గత రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. మురళి శర్మకు మాతృవియోగం సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ నటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.