హీరోగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న మురళీమోహన్ రాజకీయాల్లో కూడా తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు. హీరో అంటే అనేక రకాల పుకార్లు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరో అయినా, చిన్న హీరో అయినా కూడా ఇష్టానుసారంగా వార్తలు రాస్తూనే ఉంటారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన మురళీమోహన్ గతంలో తనపై వచ్చిన లవ్ ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ జయచిత్రతో కలిసి వరుస చిత్రాలలో పని చేసేవరకు ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు రాశారు. కానీ సినిమాలకు రాక ముందే నాకు పెళ్లి అయ్యి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా నాకు హీరోయిన్లతో సంబంధాలు పెడుతూనే వచ్చారు.
ఓ తమిళ మేగజైన్ వారు నా పెళ్లి కథనం ప్రచురించగా వారికి నోటీసులు పంపాను. దాంతో సదరు మేగజైన్ నిర్వహకులు క్షమాపణ చెప్పారు. ఓ సారి జయచిత్ర గారితో ఎయిర్పోర్ట్లో దిగాను. అక్కడకు దాసరి నారాయణ రావు కూడా వచ్చారు. దాసరి సమక్షంలో జయ చిత్రను పెళ్లి చేసుకోబోతున్న మురళీమోహన్ అంటూ ప్రచారం చేశారు. వాస్తవానికి నేను ఆమెను ఏమండీ అని పిలుస్తాను, ఇద్దరి మద్య ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. కానీ ఇష్టానుసారంగా రాయడం మొదలెట్టారు. ఆ తర్వాత నేను అలాంటి వార్తలను పట్టించుకోవడం మానేసా అంటూ జయచిత్రతో సంబంధం గూర్చి మురళీమోహన్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు.