నిర్మాణంలో అడుగు పెట్టబోతున్న ధోనీ

ఎంఎస్‌ ధోనీ.. ఈ పేరును ఇండియన్‌ క్రీడాభిమానులకు మరియు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. క్రికెటర్‌గానే కాకుండా బుల్లి తెరపై పలు కంపెనీలకు ప్రమోటర్‌గా ప్రతి రోజు కనిపిస్తూనే ఉంటాడు. ధోనీ క్రికెట్‌, అంబాసిడర్‌గానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. వేల కోట్ల వ్యాపారాలను ప్రస్తుతం ధోనీ నిర్వహిస్తున్నాడు. అలాంటి ధోనీ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ధోనీకి ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ అంటే చాలా ఆసక్తి. అందుకే త్వరలోనే తన స్నేహితుడు జాన్‌ అబ్రహంతో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. క్రికెట్‌కు దూరం అయిన తర్వాత పూర్తిగా సినిమాలకు దగ్గరగా ఉండాలని ఈయన కోరుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. సంవత్సరంకు మూడు నాలుగు సినిమాల చొప్పున చిన్న బడ్జెట్‌ సినిమాలను నిర్మించాలని, కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో పాటు, వెబ్‌ సిరీస్‌లను కూడా నిర్మించాలని ధోనీ ఆశ పడుతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.