మార్చి 16నుంచి షూటింగ్‌లు బంద్‌.. ఆరు డిమాండ్లు

సర్వీస్‌ ప్రొవైడర్ల వైఖరిని నిరసిస్తూ ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో థియేటర్లు బంద్‌ పాటించిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో బంద్ విరమించినప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తూ మార్చి 16 నుంచి కొత్త సినిమా విడుదల మాత్రమే కాదు.. షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా నిలిపివేయనుంది. ముఖ్యంగా ఆరు డిమాండ్లతో టీఎఫ్‌పీసీ ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించనుంది.

* క్యూబ్‌, యూఎఫ్‌వోలు ఇక నుంచి వర్చువల్‌ ప్రింట్‌ ఫీజును వసూలు చేయకూడదు.
* టికెట్‌ ధరలలో మార్పులు
* ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఛార్జీలను తగ్గించాలి.
* అన్ని థియేటర్లలో టికెట్లను కంప్యూటరైజ్డ్‌ చేయాలి.
* చిన్న సినిమాల ప్రదర్శనకు తగిన థియేటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
* ప్రొడక్షన్‌ వ్యయాన్ని నియంత్రించాలి.

ఈ డిమాండ్లతో బంద్ ని కొనసాగించనున్నారు