ప‌వ‌న్‌పై సినిమా?

ram-gopal-varmaక్లాష్‌ని క్యాష్ చేసుకోవ‌డం అంటే వ‌ర్మ‌కు భ‌లే స‌ర‌దా! ఎక్క‌డ సంచ‌ల‌నం ఉంటే.. వ‌ర్మ కూడా అక్క‌డే ఉంటాడు. ప్ర‌స్తుతం వ‌ర్మ దృష్టి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప‌డింది. ప‌వ‌న్ వ్య‌క్తిత్వానికీ, నిజాయ‌తీకీ ఫ్యాన్ అయిపోయిన వ‌ర్మ‌… త్వ‌ర‌లోనే ప‌వ‌న్‌పై ఓ సినిమా చేయ‌డానికి రెడీ అయిపోయాడు. ప‌వ‌న్ ఎదుగుద‌ల‌, మెగాస్టార్ త‌మ్ముడి నుంచి ప‌వ‌ర్ స్టార్‌గా మారిన‌చ వైనం, చివ‌రికి చిరునే ఎదిరించి – పార్టీ పెట్టిన ప్ర‌యాణం.. ఇవ‌న్నీ విపులంగా త‌న సినిమాలో చూపిస్తాడ‌ట‌. జ‌న‌సేన పార్టీ విధి, విధానాల‌నూ వెండి తెర‌పై ఆవిష్క‌రించే అవ‌కాశం ఉంది. త‌న శిష్య‌బృందానికి ఈ సినిమా తీసే బాధ్య‌త అప్ప‌గించినా.. వెనుక నుంచి అన్ని వ్య‌వ‌హారాలూ త‌నే చెక్క‌బెడ‌తాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని, ఎన్నిక‌ల ముందే ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నార‌ని చెప్పుకొంటున్నారు. అయితే ఈ విష‌యంపై వ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. గ‌ప్‌చుప్‌గా సినిమాలు తీసి.. జ‌నం మీదకు వ‌ద‌ల‌డం వ‌ర్మ‌కు అల‌వాటే. అలాగే ప‌వ‌న్ సినిమా కూడా చుట్టేసే కార్య‌క్ర‌మం పెట్టుకొన్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకొంటున్నాయి.