Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ పై సినిమా

ntr
తెలుగుజాతి ఖ్యాతిని న‌లుదిశ‌లా వ్యాప్తి చేసిన ఘ‌నుడు స్వర్గీయ నంద‌మూరి తార‌క రామారావు. తెలుగుజాతి ఆత్మగౌర‌వం నిల‌బెట్టిన మ‌హ‌నీయుడు ఆయ‌న‌. ఇప్పుడు ఆయ‌న జీవిత క‌థ సినిమాగా రాబోతోంది. అదే… మ‌హా ఘ‌నుడు. జె.కె.మూవీస్ ప‌తాకంపై డి.కుమార్ రాజేంద్ర ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తారు. మ‌హాన‌టుడి జీవితంలోని మ‌ధుర ఘ‌ట్టాల్ని, ఎలాంటి వివాదాస్పద అంశాలూ లేకుండా తెర‌కెక్కిస్తామ‌ని, ఈ చిత్రం ద్వారా గ‌డించిన లాభాన్ని న‌వ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి విరాళంగా ఇస్తామ‌ని చిత్రబృందం చెబుతోంది. ఎన్టీఆర్ పాత్రలో ఎవ‌రు క‌నిపిస్తార‌నేది ఆస‌క్తిక‌రం. ఆ వివరాలు త్వర‌లో వెల్లడ‌వుతాయి.

Exit mobile version