మోహిని ఫస్ట్ లుక్ ….

Mohoni-1st-look

ఒకప్పుడు టాలీవుడ్ , కోలీవుడ్ ను ఓ ఊపుఊపేసిన త్రిష , ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ రాక తో అమ్మడి హావ బాగా తగ్గింది. దీంతో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ మధ్యనే నాయకి గా పలకరించినప్పటికీ ఆ చిత్రం అనుకున్న స్థాయి హిట్ అందుకోలేపోయింది. దీంతో కాస్త డిస్పాయింట్ అయినా త్రిష మరోసారి మోహిని గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది.

Mohoni-1st-look2

ఆర్.మధేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొస్తున్నా ఈ చిత్ర ఫస్ట్ లుక్ నిన్న రాత్రి త్రిష తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ లుక్ విషయానికి వస్తే మునుపెన్నడూ కనిపించిన లుక్ లో త్రిష కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. త్రిష ఇంత డిఫరెంట్‌గా కనిపించడం పెద్ద సాహసమే అని కొందరు ప్రశంసిస్తూ ఉండగా, మరికొందరు ఇదేం లుక్ అని పెదవి విరిచేస్తున్నారు. ఫస్ట్ లుక్ ట్రైలర్ వస్తే గాని సినిమాలో ఎంత దమ్ము ఉందనేది తెలుస్తుంది.