మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తుడరుమ్’లో వెటరన్ హీరోయిన్ శోభన ఆయనకు జోడిగా నటించారు. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎం. రంజిత్ నిర్మించారు. ఈ రోజు విడుదలైన తెలుగు వెర్షన్ థియేట్రికల్ ట్రైలర్ ఎమోషన్స్, సస్పెన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన రోలర్ కోస్టర్ రైడ్‌లా కట్టిపడేసింది. మోహన్ లాల్ ఓ ట్యాక్సీ డ్రైవర్‌గా, ఫ్యామిలీ మేన్‌గా కనిపించిన తీరు ఆకట్టుకోగా, ఓ కారు, కుటుంబం చుట్టూ తిరిగే కథాకథనంతో ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.
మోహన్ లాల్ నేచురల్ & ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలవగా, శోభనతో ఆయన షేర్ చేసుకున్న అన్ స్క్రీన్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా కనిపించింది. జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ఆసక్తికరంగా ఉండగా, షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్‌గా ఉంది. దర్శకుడు తరుణ్ మూర్తి కథను చాలా ఆసక్తికరంగా ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబడుతోంది. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపా ఆర్ట్స్ పి శ్రీనివాస్ గౌడ్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు.