చిరు 152 విలన్ కలెక్షన్ కింగ్..?

మెగాస్టార్ చిరంజీవి 152 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. చిరంజీవి తాలూకా యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ లో విలన్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడనే వార్త అభిమానుల్లో సంబరాలు నింపుతుంది. మోహన్ బాబు , చిరంజీవి ఇద్దరు కూడా ఒకేసారి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారే..ముందుగా విలన్ రోల్స్ తో ప్రేక్షకులను అలరించిన వీరు..ఆ తర్వాత మెగాస్టార్ గా కలెక్షన్ కింగ్ గా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.

చిరంజీవి నటించిన పలు సినిమాల్లో మోహన్ బాబు విలన్ రోల్ నటించి ఆకట్టుకున్నారు. మల్లి ఇంతకాలానికి వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించడం విశేషం. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కొరటాల శివ సినిమాకు మణిశర్మ పనిచేస్తుండటం ఇదే తొలిసారి. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెజీనా కాసండ్రా ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక చిన్న పాత్రలో మెరవనున్నారని సమాచారం.