ఈ చిత్రం తర్వాత మోహన్ లాల్ లీడ్ రోల్లో నటించిన ఒప్పం తమిళనాట రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కూడా 50 కోట్ల వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మరో నెల రోజుల గ్యాప్లో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన పులిమురుగన్మూవీ మలయాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా దూసుకుపోతుంది. ఇలా రెండు నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో 200 కోట్ల కలెక్షన్లను సాధించడం ఒక్క మోహన్ లాల్ కే చెల్లింది.