సైరా కు బెస్ట్ విషెష్ అందించిన మోహన్ బాబు..

చిరంజీవి – మోహన్ బాబు సాన్నిహిత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వేదికలపై సరదాగా అనుకున్న ఇద్దరికీ మాత్రం ఒకరిపై ఒకరికి ఎంతో అభిమానం ఉంటుంది. ఆ అభిమానమే తాజాగా సైరా కు బెస్ట్ విషెష్ అందించేలా చేసింది. చిరంజీవి నటించిన సైరా చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులంతా చిత్రానికి బెస్ట్ విషెష్ అందిస్తున్నారు.

వీరి జాబితాలో మోహన్ బాబు కూడా చేరారు. తన ట్విట్టర్ లో సైరా చిత్రానికి అలాగే చిరంజీవి , రామ్ చరణ్ లకు విషెష్ అందించారు. నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను.. ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసారు.