Site icon TeluguMirchi.com

కలెక్షన్ కింగ్ ఫై సూర్య ట్వీట్స్..

తమిళ్ హీరో సూర్య – కలెక్షన్ మోహన్ బాబు కలిసి “సోరారై పోట్రు” అనే తమిళ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ లో సూర్య హీరోగా నటిస్తుండగా..మోహన్ బాబు ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. చాల ఏళ్ల తర్వాత మోహన్ బాబు విలన్ రోల్ చేయడం..అది కూడా లేడి డైరెక్టర్ సుధా డైరెక్షన్లో చేయడం తో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

చెన్నైలో జరిగిన ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ ఇద్దరు నటులు కలిసి నటించారు. కాగా మొదటిసారి షూటింగ్ లో కలిసిన వీరు మంచి మిత్రులయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు.

ముందుగా సూర్య తన ట్విట్టర్ లో “నిబద్దత,క్రమశిక్షణ కలిగిన గొప్ప నటుడు మోహన్ బాబు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది, 500 సినిమాల ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం స్ఫూర్తి దాయకం, “సోరారై పోట్రు” చిత్రంలో నటిస్తున్నందుకు ధన్యవాదాలు” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

దీనికి సమాధానంగా మోహన్ బాబు ” నాపై మీకున్న అభిప్రాయానికి ధన్యవాదాలు, అగ్ర హీరో ఐనా కూడా సెట్స్ లో మీ క్రమశిక్షణ,వినయం మీ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. సెకండ్ షెడ్యూలు కోసం ఎదురుచూస్తున్నాను, యంగ్ ఫ్రెండ్” అని కొంచెం ఎమోషనల్ గా స్పందించారు.

Exit mobile version