మోహ‌న్‌బాబు మ‌ళ్లీ కెలుకుతున్నాడు

ykvqcmrl

ప‌ద్మ‌శ్రీ వ్య‌వ‌హారం ఇప్ప‌ట్లో తేలేలా లేదు. ప‌ద్మ‌శ్రీ బిరుదుని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడొద్ద‌ని, వినోదాత్మ‌క చిత్రాలు తీసిన‌ప్పుడు టైటిల్ కార్డులో వేసుకోవ‌ద్ద‌ని హైకోర్టు మోహ‌న్‌బాబుని గ‌ట్టిగానే క్లాస్ పీకింది. అయితే.. ప‌ద్మ‌శ్రీ‌ని మరోసారి కెలికి మోహ‌న్ బాబు ఈ వ్య‌వ‌హారాన్ని ఇంకాస్త పెద్ద‌ది చేసుకొంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. “ప‌ద్మ‌శ్రీ మోహ‌న్‌ బాబుని తెచ్చుకొంది. మోహ‌న్‌ బాబు ప‌ద్మ‌శ్రీ‌ని తెచ్చుకోలేదు.“ అని మ‌ళ్లీ ప‌ద్మ‌శ్రీ‌తో పెట్టుకొన్నాడు క‌లెక్ష‌న్ కింగ్‌. ప్ర‌భుత్వం ఇచ్చే బిరుదుల విష‌యంలో చాలా సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలి. పైగా ఇప్పడా వ్య‌వ‌హారం కోర్టులో ఉంది. ఏం మాట్లాడినా త‌ల‌నొప్పే. అందుకే కామ్ గా ఉంటారంతా. కానీ మోహ‌న్‌ బాబు అలా కాదుక‌దా..? ఏరి కోరి ఈ విష‌యంలో వివాదాలు కొని తెచ్చుకొంటున్నాడు. మ‌రి ఈ తాజా స్టేట్మెంట్ ఇంకెన్ని త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతుందో..?

అన్న‌ట్టు ప‌ద్మ‌శ్రీ విష‌యంలో మోహ‌న్‌ బాబుకి కాస్త ఊర‌ట‌. ప‌ద్మశ్రీ విష‌యంలో హైకోర్టు విధించిన ఆంక్ష‌ల్ని స‌వాల్ చేస్తూ మోహ‌న్‌బాబు సుప్రీంకోర్టులో ఓ పిటీష‌న్ వేశారు. దాన్ని కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది. త‌దుప‌రి తీర్పు వ‌చ్చేవ‌ర‌కూ హైకోర్టు నిర్ణ‌యంపై స్టే ఇచ్చింది.