Site icon TeluguMirchi.com

మోహన్ బాబు ను దెబ్బ కొట్టిన నందమూరి హీరో..

హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నందమూరి కళ్యాణ్ రామ్..ప్రస్తుతం మల్లిడి వేణు డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. కథ బాగా నచ్చడం తో బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టి సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ‘రావణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసాడు. అయితే ఈ టైటిల్ ఫై మోహన్ బాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్నాళ్ల క్రితమే’రావణ’ పేరుతో మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఒక పౌరాణిక చిత్రం తీయాలని కొందరు నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంతలోనే కళ్యాణ్ రామ్ ఆ టైటిల్ పెట్టుకుని సినిమాను ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మోహన్ బాబు సినిమా టైటిల్ చేంజ్ చేస్తారా..లేక కళ్యాణ్ రామ్ చేంజ్ చేసుకుంటాడా అనేది చూడాలి.

Exit mobile version