Site icon TeluguMirchi.com

పవన్ తో గొడవకు దిగిన మోహన్ బాబు..?

Pawan-Mohan-Godavaపవన్ కళ్యాణ్ తో గొడవపడుతున్న మోహన్ బాబు..? ఏంటి ఇది నిజమా..? అనే కదా మీ సందేహం..మీరు చదవిన టైటిల్ నిజమే కానీ అది నిజ జీవితం లో మాత్రం కాదులెండి..త్వరలో దాసరి నారాయణరావు పవన్ కళ్యాణ్ తో చేయబోయే చిత్రం లో మోహన్ బాబు విలన్ రోల్ లో నటిస్తున్నాడని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే మెగా అబిమానులు దాసరి తో పవన్ సినిమా అంటేనే నమ్మలేకపోతున్నారు..అలాంటిది మోహన్ బాబు తో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తాడనే వార్త జీర్ణించుకోలేక పోతున్నారు. మోహన్ బాబు అంటేనే గుర్రుగా ఉండే పవన్..అతడి తో సినిమా ఎలా చేస్తాడు అనే వాళ్ళు లేకపోలేదు. మరికొందరు దాసరికి – మోహన్ బాబు కు ఉన్న సాన్నిహిత్యం వల్ల మోహన్ బాబు ఒప్పుకొని ఉండవచ్చు అనే వాళ్ళు ఉన్నారు.

ఇంతవరకు ఈ సినిమా కు సంబంధించి ఎటువంటి ప్రకటన అధికారికంగా రానప్పటికీ, మీడియా లో మాత్రం ఈ చిత్ర నటి నటులు గురించి ఎవరికీ వారే పబ్లిసిటీ చేస్తున్నారు. ఏది ఏమయినా ఫ్రీ పబ్లిసిటీ ఇష్ట పడే దాసరి మాత్రం ఈ న్యూస్ అన్నిటిని చూసి తెగ సంబరపడుతున్నాడట. మొత్తంగా పవన్ నోటినుండి ప్రకటన వచ్చే వరకు ఈ గాసిప్స్ కు స్టాప్ అనేది ఉండదు..చూద్దాం పవన్ నోటి నుండి ఏ కబురు వస్తుంది.

Exit mobile version