నో డౌట్ . లాక్ డౌన్ టైం ఇంకా పెరగనుంది. నిన్న తెలంగాణ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కొనసాగించడం మినహా వేరే గత్యంతరం లేదని, లాక్ డౌన్ కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి తాను విజ్ఞప్తి చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే కేసీఆర్ మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధంగా సూచనలు చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సి ఉందని ప్రకటించారు. మరొక పక్క ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా దీన్ని కొనసాగించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇదే తరహా విజ్ఞప్తి చేశారు.
ఐతే దీని వెనుక కూడ కేంద్రం వ్యూహం ఉంది. మొదట రాష్ట్రాలని ప్రిపేర్ చేసి తర్వాత దేశం మొత్తం పొడిగింపు ప్రకటన చేసే ఉద్దేశంతోనే ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ విషయంలో ప్రకటన చేస్తున్నారని భావించవచ్చు.