తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు మోడీ పిలుపు

ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడినా కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన గురించి మాట్లాడే సమయంలో ఆయన తీసుకునే ఉదాహరణలు మరియు చెప్పుకొచ్చే సందర్బాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయనే టాక్‌ ఉంది. తాజాగా మోడీ కశ్మీర్‌ను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెల్సిందే. కాశ్మిర్‌ భూతల స్వర్గం అని, ఇన్నాళ్లు కొన్ని కారణాల వల్ల దాన్ని పట్టించుకోలేదని, ఇకపై దేశ వ్యాప్తంగా కశ్మీర్‌కు మంచిగుర్తింపు తీసుకు వచ్చేలా ప్రచారం చేస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటించారు.

కశ్మీర్‌లో అందమైన లొకేషన్స్‌ ఎన్నో ఉంటాయి. అక్కడ షూటింగ్స్‌ నిర్వహించాలంటూ హిందీ మరియు తెలుగు సినిమా దర్శక నిర్మాతలకు మోడీ పిలుపునిచ్చారు. అక్కడ స్టూడియోలు కట్టడంతో పాటు, ఔట్‌ డోర్‌ షూటింగ్స్‌ కూడా చేయాలని, సినిమా అభివృద్దికి కశ్మీర్‌ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని చెప్పుకొచ్చాడు. కశ్మీర్‌లో షూటింగ్‌కు తమ సంపూర్ణ మద్దతుతో పాటు రక్షణ కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.