ఎం.ఎల్.ఎ ట్రైలర్ టాక్ ..

కళ్యాణ్ రామ్, కాజల్ జంటగా ఉపేంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఎం.ఎల్.ఎ. మార్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు. ట్రైలర్ లో కళ్యాణ్ రామ్ అదరగొట్టాడు. ” మా ఊర్లో నన్ను అంత మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అంటారు. అందుకే నన్ను షార్ట్ గా ఎం.ఎల్.ఎ ” అంటుంటారని కళ్యాణ్ రామ్ డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది.

ఓవరాల్ గా ట్రైలర్ నందమూరి అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కళ్యాణ్ రామ్ – కాజల్ మధ్య సన్నివేశాలు , వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు హైలైట్ గా ఉండబోతాయని తెలుస్తుంది. తాజాగా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. మొత్తం చిత్ర నిడివి రెండు గంటల తొమ్మిది నిమిషాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫి అందించాడు.