లెజెండ్‌… మిక్స్‌డ్ కామెంట్స్

lejend‘లెజెండ్’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది. బాల‌కృష్ణ స‌ఫారీ కారు ముందు ఠీవీగా క‌నిపిస్తున్నాడు. చూడ‌గానే.. అంతా మైండ్ బ్లోయింగ్ అనేశారు. ఈ లుక్‌ లోనే ఈ సినిమా క్యారెక్టరైజేష‌న్ క‌నిపిస్తోంది. బాల‌య్య లుక్ అదిరిపోయింది.. అని నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకొంటున్నారు. అయితే మ‌రో వ‌ర్గం మాత్రం సింహాలో స్టిల్ చూస్తున్నట్టే ఉంది… అంటున్నారు. ‘సింహా’కీ, ‘లెజెండ్‌’ కీ విగ్ మారింది త‌ప్ప గెట‌ప్ లో ఎలాంటి తేడా లేద‌ని వాదిస్తున్నారు. మొత్తానికి లెజెండ్‌… హంగామా మొద‌లైపోయింది. ఈ సంక్రాంతికి టీజ‌ర్ ని కూడా చూపిస్తారు. బాల‌య్య ఫ్యాన్స్ కోసం లెజెండ్ క్యాలెండ‌ర్‌ ని ప్రత్యేకంగా రూపొందిస్తున్నార‌ట‌. అది అభిమానుల్ని మ‌రింత అల‌రించ‌డం ఖాయం.