Site icon TeluguMirchi.com

ఇప్పుడు కత్తిరించి ఏం లాభం మిస్టర్..?

mister

వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘మిస్టర్’. మొదటి షో తోనే డివైడ్ టాక్ రావడం తో..పబ్లిక్ ఈ మూవీ ఫై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు..అది కాక సినిమాకు రన్ టైం కూడా ఎక్కువగా ఉందని విమర్శలు రావడం తో చిత్ర యూనిట్ ఫస్ట్ హాఫ్ , సెకండ్ హాఫ్ లో అనవసర సన్నివేశాలను తొలిగించే పని పెట్టుకున్నారు..

సినిమాలోని కొన్ని సీన్లను సుమారు 17 నిముషాల నిడివి వరకు కట్ చేసినట్టు సమాచారం. ఈ కత్తిరింపులతో ఆడియన్స్ కాస్త వెసులుబాటు ఫీలయ్యే అవకాశముందని, ఈ కటింగ్స్ లో కొన్ని అనవసరమైన బోరింగ్ సీన్స్ కూడా తొలగించబడ్డాయని, దీంతో చిత్రాన్ని చోడటం మునుపటి కంటే ఇప్పుడు ఇంకాస్త సౌకర్యవంతంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు..కానీ ఆడియన్స్ ఫీలింగ్ మాత్రం ఈ జాగ్రత్త ముందే ఉంటె బాగుండు..సినిమా డిజాస్టర్ అయ్యాక కత్తిరింపులు చేస్తే ఏం లాభం అంటున్నారు. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలపు బుజ్జిలు సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version