Site icon TeluguMirchi.com

మిస్టర్ ప్లాప్ కావడానికి అసలు కారణం వాస్తు దోషమేనట.

srinu vaitla

ఒకప్పుడు వరుస హిట్స్ అందుకొని అగ్ర దర్శకుల్లో స్థానం సంపాదించుకున్న శ్రీను వైట్ల..ఇప్పుడు వరుస ప్లాప్స్ తో దారుణమైన పరిస్థితి లో ఉన్నాడు. ఆగడు..బ్రూస్ లీ తర్వాత వరుణ్ తేజ్ తో తాజాగా తెరకెక్కించిన మిస్టర్ మూవీ తో ఎలాగైనా హిట్ కొడతాడని అంత అనుకున్నారు కానీ అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి..ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని అట్టర్ ప్లాప్ అయ్యింది.

దీనికి కారణం ఆయన ఇంటి వాస్తు దోషమే అంటున్నారు ఆయన సన్నిహితులు.. ‘ఆగడు’ సినిమా అప్పుడు శ్రీను జూబిలీహిల్స్ లో ఉన్న కొత్త ఇంటిలోకి వెళ్ళాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే వాస్తులో కొన్ని మార్పులు చేసినా అంతగా కలిసిరాలేదు. దాని తరువాత వచ్చినా బ్రూస్ లీ కూడా ఫెయిల్ అయింది. ఇంకా వాస్తు అనుమానం బలం చేకూరింది. ఇప్పుడు మిస్టర్ సినిమాకు ప్లాప్ కావడం తో ఇంటిని పూర్తిగా మార్చాలనే ఆలోచనలో ఉన్నాడట. ఈ వార్తలు విన్న ప్రేక్షకులు మాత్రం వాస్తు కాదు ముందు నీ కథలో ఆలోచన మార్చుకుంటే మంచిదని అంటున్నారు.

Exit mobile version