Site icon TeluguMirchi.com

మిస్టర్ దెబ్బకు బయ్యర్లు కష్టాలు అన్ని ఇన్ని కావు.

mister

వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ మూవీ మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది..ఈ దెబ్బ తో చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇప్పటివరకు వరుణ్ తేజ్ నటించిన ఏ చిత్రం కూడా హిట్ కాలేదు..అయినాగానీ శ్రీను వైట్ల – వరుణ్ ఫై నమ్మకం తో ఈ చిత్రాన్ని భారీ రేటుకు కొనుగోలు చేసారు. కానీ ఇప్పుడు ఈ మూవీ కూడా ప్లాప్ కావడం తో వారు లబోదిబోమంటున్నారు. ఎలాగైనా నిర్మాతలు తమను ఆదుకోవాలని వాపోతున్నారు.

ఈ మధ్యనే విన్నర్ చిత్రం తో నష్టాల్లో ఉన్న నిర్మాతలు నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి).. ఠాగూర్‌ మధు..ఇప్పుడు మిస్టర్ కూడా ఢమాల్ అనడం తో నిండా మునిగారు. ఇలాంటి టైం లో బయ్యర్లను ఆదుకోవడం అంటే కాస్త అనుమానమే. కొంత నష్టమైతే ఫరవాలేదు కానీ ఇంతటి దారుణమైన నష్టాన్ని ఎలా భరించాలి అంటూ బయ్యర్లు గగ్గోలు పెడుతున్నారు..మరి వీరిని ఎవరు రక్షిస్తారో చూడాలి.

Exit mobile version