Site icon TeluguMirchi.com

ఫుల్ ఎంటర్టైనర్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్..


స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, జాతి ర‌త్నాలు ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు పి.మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే అనుష్క కమ్ బ్యాక్ మూవీ కావడంతో, ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక ట్రైలర్ ఆద్యంతం ఫన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. అనుష్క శెట్టి, నవీన్ శెట్టి ల మధ్య జరిగే సన్నివేశాలతో పాటు.. నవీన్ శెట్టి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటాయి. ఇక డైలాగ్స్ అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఫుల్ ఎంటర్టైనర్ గా సాగిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటించగా, అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ సంగీతం అందిస్తున్నాడు.

Miss Shetty Mr Polishetty Telugu Trailer | Anushka Shetty | Naveen Polishetty | Mahesh Babu P

Exit mobile version