స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి జంటగా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు పి.మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అనుష్క కమ్ బ్యాక్ మూవీ కావడంతో, ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఇక ట్రైలర్ ఆద్యంతం ఫన్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుంది. అనుష్క శెట్టి, నవీన్ శెట్టి ల మధ్య జరిగే సన్నివేశాలతో పాటు.. నవీన్ శెట్టి కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటాయి. ఇక డైలాగ్స్ అయితే అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఫుల్ ఎంటర్టైనర్ గా సాగిన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటించగా, అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. ఇక అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ సంగీతం అందిస్తున్నాడు.