‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రిలీజ్ డేట్ వచ్చేసింది !


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఒక చెఫ్‌కు, కమెడియన్‌కు మధ్య సాగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్‌బాబు పి దర్శకత్వం వహించారు. లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరించ ఆసక్తిని పెంచాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఆగష్టు 4 న థియేటర్స్లోకి రాబోతుంది, నవ్వడానికి రెడీగా వుండండి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది చిత్రయూనిట్. ఇకపోతే అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మెప్పంచ‌టానికి ఆగ‌స్ట్ 4న మ‌న ముందుకు వ‌చ్చేస్తుంది.