‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ డేట్ వచ్చేసింది !


స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, జాతి ర‌త్నాలు ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాకు పి.మ‌హేష్ బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనుష్క కమ్ బ్యాక్ మూవీ కావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను మొదటగా ఆగష్టు 4న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా పడింది.

ఇకపోతే రీసెంట్ గా ఈ సినిమాను కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ ను ఆగష్టు 21న రిలీజ్ చేయనున్నట్లు అఫిషియల్ గా ప్రకటించారు. కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటించగా, అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ రాధన్ సంగీతం అందిస్తున్నాడు.