అద్భుతాలు జరుగుతాయి: రజినీ

rajiniఅద్భుతాలు జరుగుతాయనే విషయాన్ని చాలా మంది నమ్మరు. కానీ నేను నమ్ముతాను. జీవితంలో అద్భుతాలు జరుగుతాయనడానికి తానే ఓ నిదర్శనం. ఒక సాధారణ బస్ కండక్టర్ గా వుండే నేను ఈరోజు ఇంతా గొప్ప వ్యక్తులతో వేదిక పై వుండటం అద్భుతమే కదా” అని అన్నారు సూపర్ స్టార్ రజినీ కాంత్. ఎన్డీటీవీ నిర్వహించిన ’25 గ్లోబల్ ఇండియన్ లెజెండ్స్’ సన్మాన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా రజనీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రజనీ పై విధంగా స్పందించారు. వార్డును తన గురువు బాలచందర్, సోదరుడు సత్యనారాయణరావ్ గైక్వాడ్ తో పాటు తమిళ ప్రజలకు అంకితం చేశారు.