Site icon TeluguMirchi.com

‘తడాఖా’ కు ఆదిలోనే అపశృతి !

thadaka-movie-first-lookనాగ చైతన్య, సునీల్ హీరోలుగా నటించిన ‘తడాఖా’ కు ఆదిలోనే అపశృతి ఎదురైంది. ప్రసిద్ధ ఐమాక్స్ లో ట్యూబ్ సిస్టమ్ పనిచేయకపోవడంతో.. యాజమాన్యం ప్రింట్ తెప్పించి సినిమా స్టార్ట్ చేసే ప్రయత్నాలు కూడా చేసింది. సాంకేతిక కారణాలతో ఆ ప్రింట్ ప్రయత్నం కూడా బెడసికొట్టంది. దీంతో… ఐమాక్స్ యాజమాన్యం సాంకేతిక కారణాలవల్ల ’తడాఖా’ 09.30 షోని క్యాన్సల్ చేసుకుంటున్నామని ప్రకటించింది. ఇలా జరగడం ఐమాక్స్ చరిత్రలో ఇదే మొదటి సారి. ఓ పెద్ద హీరో సినిమాకే ఇలాంటి పరిస్థితి నెలకొంటే.. ఇక చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చైతన్య తడాఖా చూపిద్దామనుకున్న…’తడాఖా’ సినిమాకి ఆదిలోనే అపశృతి ఎదురవ్వడంతో చేతూ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.

Exit mobile version