Site icon TeluguMirchi.com

‘భోళా శంకర్’ నుండి మిల్కీ బ్యూటీ సాంగ్‌.. అదిరిపోయింది !


మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భోళా శంకర్’. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసాయి. ముఖ్యంగా ‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ అయితే ఒక రేంజ్ లో సోషల్ మీడియాను ఊపేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని మిల్కీ బ్యూటీ సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

ఇక చిరు అండ్ తమన్నా పై స్విట్జర్లాండ్ లో తెరకెక్కించిన ఈ మెలోడీ పాటను విజయ్ ప్రకాష్, సంజన కలమంజే, మహతి స్వర సాగర్ ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటలో చిరు క్లాస్సీ స్టెప్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తమన్నా సైతం తన గ్లామర్‌తో కట్టేపడేసింది. కాగా ఈ సినిమాలో చిరుకి సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Milky Beauty Lyrical Song |Bholaa Shankar | Chiranjeevi, Tamannaah |Meher Ramesh |Mahati Swara Sagar

Exit mobile version