ప్రముఖ బాలీవుడ్ సింగర్, స్టేజ్ పర్ఫార్మర్ మికా సింగ్ కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్లో ముషారఫ్ ఇంట్లో జరిగిన ఒక వేడుకలో సంగీత కచేరి నిర్వహించిన విషయం తెల్సిందే. ఇండియా పాకిస్తాన్ల మద్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో అక్కడ మికా సింగ్ సంగీత కచేరి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో ఇండియాలోని ఫిల్మ్ వర్కర్స్ యూనియన్ వారు మికా సింగ్ను బ్యాన్ చేయడం జరిగింది.
తనపై బ్యాన్ విధించడంపై స్పందించిన మికా సింగ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో తాను దేశానికి క్షమాపణలు చెబుతున్నట్లుగా పేర్కొన్నాడు. తాను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను అని, దేశ ప్రజలందరికి కూడా క్షమాపణలు చెబుతున్నట్లుగా మికా సింగ్ చెప్పాడు. క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఆయనపై బ్యాన్ ఎత్తి వేయనున్నార అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మికా సింగ్ క్షమాపణ లేఖను తాజాగా ఫిల్మ్ వర్కర్స్ యూనియన్ అందుకుంది. చర్చలు జరిపి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.