కెజిఎఫ్ 2 ను వదలని టిఎస్ పోలీసులు


ఈ మధ్య టీఎస్ ఆర్టీసీ , టీఎస్ పోలీసులు పెద్ద సినిమాలను బాగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ చిత్రాల తాలూకా డైలాగ్స్ , పోస్టర్స్ , స్టిల్స్ ను వాడుకుంటూ ట్రాఫిక్ రూల్స్ మరియు ఇతర విషయాలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ట్రాఫిక్ రూల్స్ విషయంలో అస్సలు జాగ్రత్తలు పాటించడం లేదు. దాంతో సోషల్ మీడియాలో వారిని టార్గెట్ చేసుకుని పోస్ట్ లు చేస్తున్నారు. అప్పుడు పుష్ప.. రాధేశ్యామ్.. ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్ 2 ఇలా ఫేమస్ సినిమా లను పోలీసు వారు ఉపయోగించుకుంటున్నారు.

తాజాగా కేజీఎఫ్ 2 లోని యశ్ డైలాగ్ వయలెన్స్.. వయలెన్స్… ఐ డోంట్ లైక్ ఇట్.. ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. హెల్మెట్.. హెల్మెట్.. హెల్మెట్.. ఐ డోంట్ లైక్ ఇట్.. బట్ హెల్మెట్ సేవ్స్ మై లైవ్ అంటూ ఉన్న మీమ్ ను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.