Site icon TeluguMirchi.com

Operation Valentine : ట్రైలర్ కి మెగాపవర్ స్టార్.. ప్రీ రిలీజ్ కి మెగాస్టార్ !!


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో 6 రోజుల్లో మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈచిత్రం నుండి రిలీజైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలు పెంచేసింది.

కాగా, రేపు హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్స్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వేడుకకు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రాంచరణ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీ రిలీజ్ కు మెగాస్టార్ గెస్ట్ గా రావడం సినిమాకు అదనపు మైలేజీని తెస్తుంది. మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, రుహాని శర్మ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version