Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి యూకే పార్లమెంట్‌లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించబడటం గర్వకారణం. ఈ సన్మానం టీమ్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగగా, అనేక మంది పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం తనను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుందని, అలాగే మానవతా కార్యక్రమాల్లో కొనసాగేందుకు మరింత శక్తినిస్తుందని ట్వీట్ చేశారు.
Also Read : సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లకి తెలంగాణ మహిళా కమిషన్ హెచ్చరిక
సినీ కెరీర్ విషయానికి వస్తే, చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతోంది. చిరంజీవి ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Betting App Promotions : చట్టప్రకారమే యాడ్ ప్రమోషన్స్ : విజయ్ దేవరకొండ
Heart filled with gratitude for the honour at the House of Commons – UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India.
Words are not… pic.twitter.com/XxHDjuFIgM
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025