Site icon TeluguMirchi.com

‘దసరా’ సినిమాపై మెగాస్టార్ ప్రశంసల వర్షం..


చిన్నా, పెద్ద అని తేడాలేకుండా విజయం సాధించిన ప్రతి సినిమాను వీక్షించి.. వారి ప్రతిభను ప్రశంసించడంలో చిరు తరువాతే ఎవరైనా. తాజాగా చిరంజీవి.. దసరా సినిమాను వీక్షించి, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. హీరో, హీరోయిన్, డైరెక్టర్, మొత్తం చిత్ర బృందాన్ని ప్రశంసించారు. “ప్రియమైన నానీకి అభినందనలు. ‘దసరా’ సినిమా చూశాను. సినిమా అద్భుతంగా ఉంది. నీ మేకోవర్‌, నటనతో చంపేశావ్. ఇది శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. అతని పనితనాన్ని ప్రశంసించకుండా ఉండలేం. మన ‘మహానటి’ కీర్తి సురేష్ వావ్ అనిపించింది. కుర్రాడు దీక్షిత్ శెట్టి కూడా పాత్రలో జీవించేశాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ చించేశారు. మొత్తం ‘దసరా’ బృందానికి కుడోస్’ అని ట్విట్టర్ వేదికగా పొగడ్తలతో ముంచెత్తారు చిరు.

ఇక మెగాస్టారే చిత్ర బృందాన్ని ప్రశంసించేసరికి నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఆనందం అవధులు దాటింది. చిరు ట్వీట్ కు స్పందిస్తూ నాని.. “మీరెప్పటికీ మా మెగాస్టారే సార్. వెండితెర మీద మాత్రమే మెగాస్టార్ కాదు.. సినిమా కోసం, సినిమా వాళ్ల కోసం ఎల్లప్పుడూ నిలబడే మెగా హార్ట్ మీ సొంతం” అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీకాంత్ ఓదెల అయితే.. “ఎగురుతున్నా.. థాంక్యూ బాస్” అంటూ చిన్నతనంలో చిరు వీణ స్టెప్ వేస్తున్న ఫోటోను షేర్ చేశాడు.

ఇక ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, దీక్షిత్ శెట్టి, సముద్ర ఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం థియేటర్ల లో ఇంకా విజయవంతం గా రన్ అవుతుంది.

Exit mobile version