Site icon TeluguMirchi.com

కొరటాల కోసం మెగాస్టార్‌ బాగానే కష్టపడ్డాడు

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రంకు ముందు వరకు రాజకీయాల్లో ఉన్న విషయం తెల్సిందే. రాజకీయాల్లో ఉన్న సమయంలో చిరంజీవి చాలా లావు అయ్యాడు. సినిమాల్లో రీ ఎంట్రీ కోసం చిరంజీవి కాస్త సన్నబడ్డాడు. ఖైదీ నెం.150 చిత్రంలో ఆకట్టుకునేలా కనిపించిన చిరంజీవి సైరా చిత్రం కోసం మరోసారి బరువు తగ్గాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర కోసం చిరంజీవి మరో అయిదు నుండి ఏడు కేజీల బరువు తగ్గినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి భారీగానే బరువు తగ్గినట్లుగా తాజాగా బయటకు వస్తున్న లుక్స్‌ను బట్టి అనిపిస్తుంది.

చిరంజీవి త్వరలో తన 152వ చిత్రంలో నటించబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాను అక్టోబర్‌లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నారు. డబుల్‌ రోల్‌లో చిరంజీవి నటించబోతున్నాడు. చిరంజీవి రెండు విభిన్న పాత్రల్లో కనిపించడంతో పాటు, రెండు విభిన్నమైన బాడీలాంగ్వేజ్‌ మరియు రెండు రకాల మేకోవర్‌తో కనిపించబోతున్నాడట. ఇక ఈ చిత్రం కోసం చిరంజీవి దాదాపుగా 10 కేజీల బరువు తగ్గాడంటూ సమాచారం అందుతోంది.

తాజాగా ఒక అవార్డు వేడుకలో పాల్గొన్న చిరంజీవి ఇలా కనిపించాడు. ఈ సినిమాలో ఒకటి కాదు పది కాదు ఏకంగా 30 ఏళ్లు తగ్గి మరీ కనిపిస్తున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు. నిజంగానే ఈ లుక్‌లో చిరంజీవి అదిరిపోయాడు. కొరటాల సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నట్లుగా దీన్ని బట్టే అర్థం అవుతుంది.

Exit mobile version