మెగాస్టార్ మెచ్చిన బాహుబలి

‘బాహుబలి 2’ ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖులు, అభిమానులు చిత్రం అద్భుతంగా ఉందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. తాజాగా ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి చేరారు.

బాహుబలి-ది కంక్లూజన్ మూవీని ఔట్ స్టాండింగ్ సినిమాగా అభివర్ణించారు చిరంజీవి. క్రెడిట్ మొత్తం రాజమౌళికే దక్కుతుందన్న మెగాస్టార్.. .సినిమా యూనిట్ అందర్ని పేరుపేరునా ప్రస్తావించారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ కు అభినందనలు చెప్పారు. రచయిత విజయేంద్రప్రసాద్, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ తో పాటు గ్రాఫిక్స్ విభాగానికి ప్రత్యేకంగా అభినందలు తెలియజేశారు.