మెగాస్టార్ @ బన్నీ సెట్స్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుండి సినిమా వస్తుందంటే చాలామంది అందులోని ఐటెం సాంగ్ ఫై ప్రత్యేక దృష్టి పెడతారు. ఆర్య నుండి డీజే మూవీ వరకు కూడా ఆయన నటించిన సినిమాల్లో ఐటెం సాంగ్ హైలైట్ గా నిలుస్తూ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు చేస్తున్న నా పేరు సూర్య మూవీ లో సైతం ఐటెం సాంగ్ హైలైట్ గా ఉండబోతుందట.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ఈ మాస్ సాంగ్ చిత్రీకరించారు. అల్లు అర్జున్ , హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఫై ఈ సాంగ్ ను షూట్ చేసారు. తాజాగా ఈ సెట్ కు మెగా స్టార్ చిరంజీవి , అల్లు అరవింద్ వచ్చి ఈ సాంగ్ చూడడం జరిగింది. ఇక ఈ మూవీ ని మే 4న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.