Site icon TeluguMirchi.com

మహేష్ తెచ్చిన మెగా vs అల్లు వివాదం..

కొన్ని రోజుల క్రితం వరకు అల్లు హీరోలను మెగా హీరోలుగానే అభిమానులు గుర్తించే వారు..కానీ ఈ మధ్య అల్లు అర్జున్ అభిమానులు అంటూ బయటకు వచ్చారు..దీనికి కారణం కూడా అల్లు అర్జున్ చేసిన కామెంట్లే..ఓ సినిమా వేడుకలో అల్లు అర్జున్‌ చేసిన కామెంట్‌ మెగా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. మెగా హీరోల సినిమా వేడుకల్లో పవర్‌ స్టార్‌ అంటూ ఫ్యాన్స్‌ అరవటం ఈ మధ్య తరచూ కనిపిస్తోంది. ఈ అరుపులపై హీరోలు అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఓ వేడుకలో పవర్‌ స్టార్‌ అనాలంటూ బన్నీని ఒత్తిడి చేశారు ఫ్యాన్స్‌. అయితే బన్నీ మాత్రం చెప్పను బ్రదర్‌ అంటూ రిప్లై ఇవ్వటంతో అది మెగా ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. అప్పటి నుండి బన్నీ ని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. దాంతో కొంతమంది బన్నీ అభిమానులుగా బయటకొచ్చారు.

ఇప్పుడు సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రకటన తో మరోసారి అల్లు vs మెగా అనే వివాదం తెరపైకి వచ్చింది. మహేష్ నటించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. బన్నీ సినిమాను వదిలి మహేష్ సినిమాకు వెళ్లడం ఏంటి అని గుర్రుగా ఉన్నారు. మరి చిరు ఎందుకు ఆ సినిమా వేడుకకు వెళ్తున్నాడో ఆయనకే తెలియాలి అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తం మీద మాత్రం మరోసారి అల్లు ఫ్యామిలీ , మెగా ఫ్యామిలీ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Exit mobile version