Site icon TeluguMirchi.com

విదేశాల్లో బాస్ సందడి మాములుగా లేదు..

chiru-usa-sandadi

బాస్ ఇస్ బ్యాక్ అంటూ మెగా స్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ళ తర్వాత ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇస్తుండడం తో , బాస్ కు గ్రాండ్ గా వెల్ కామ్ చెప్పాలని తెలుగు రాష్ట్రాల అభిమానులే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు , మెగా అభిమానులు కూడా ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే మెగా సందడి అన్ని చోట్ల మొదలయ్యింది.

అమెరికాలో ప్రసిద్ధిగాంచిన ఒమాహాలో చిరు ఫ్యాన్స్ అందరు దాదాపు ఒక 30 కాస్ట్లీ కార్లతో ర్యాలీ నిర్వహించారు. తమ అభిమానాన్ని మొదటిరోజు టిక్కెటుతో తీర్చుకోలేమని వారు చూపిస్తున్నారు. వీరి అభిమానాన్ని చాటుకుంటూ చిరంజీవి చిత్రాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జతకలిపిన వీడియో అందరికీ పాత స్మృతులను జ్ఞప్తికి తెస్తున్నాయి. చివర్లో అన్ని కార్లూ జత చేర్చి చిరు అని ఆంగ్ల అక్షరాలలో పేర్చిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఆ వీడియో మీరు చూసి మీ అభిమానాన్ని షేర్, లైక్స్ రూపం లో పంచుకోండి..

Exit mobile version