Site icon TeluguMirchi.com

అమెరికన్ టాక్ షోలో రాంచరణ్.. అరుదైన ఘనత


మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గుడ్‌ మార్నింగ్‌ అమెరికా షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతదేశం తరుపున ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి నటుడు రామ్‌చరణే కావడం విశేషం.హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు న్కూయార్క్‌కు వెళ్లిన ఆయన తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

ఫేమస్ అమెరికన్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్న రాంచరణ్ ను.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధానమైనది ఏంటి అని యాంకర్స్ ప్రశ్నించగా.. ఫ్రెండ్ షిప్, అన్నదమ్ముల బంధం అని రాంచరణ్ వివరించారు. ఇక నాటు నాటు సాంగ్ డ్యాన్స్, లిరిక్స్ ఇలా అన్ని విధాలుగా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ ఐంది అని చరణ్ పేర్కొన్నాడు. 88 ఏళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో తొలిసారి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి.. చరణ్ గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొనడం దేశం గర్వించదగ్గ విషయం అంటూ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Exit mobile version